జియో కి పోటీగా పతంజలి సిమ్ కార్డులూ వచ్చేశాయి

Patanjali SIM cards came in to compete with jio

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మార్కెట్ లో దూసుకుపోతున్న పతంజలి ఆయుర్వేద్ సంస్థ ఇప్పుడు టెలికాం సెక్టార్ లోకి అడుగుపెట్టనుంది. ప్రభుత్వ రంగ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్)తో వ్యాపార్ ఒప్పందాలు చేసుకున్న రాందేవ్ బాబా.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే, తొలుత ఈ సిమ్ కార్డులు పతంజలి ఆఫీస్ బేరర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వచ్చాక కార్డు ద్వారా పతంజలి ఉత్పత్తులపై పదిశాతం రాయితీ లభిస్తుంది.

ఈ సంస్థ అందించే సిమ్ కార్డు ద్వారా కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశ వ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా, 2 జీబీ డేటా ప్యాక్ తో పాటు 100 ఎస్ఎమ్మెస్ లు పంపుకోవచ్చని పేర్కొన్నారు. ఇవి కాకుండా వినియోగదారులకు రూ.2.5 లక్షల మెడికల్, రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డుల కోసం బీఎస్ఎన్ఎల్ 5 లక్షల కౌంటర్లు ప్రారంభించినట్టు రాందేవ్ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ ఎల్ కౌంటర్ల ద్వారా ఈ సిమ్ కార్డులను అందజేస్తామని చెప్పారు.