ఆ రహస్యం దాచిన పవన్ .

Pawan kalyan doesn't reveals secret of who tried to killed him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఈ మూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ నాయకుడు మాట్లాడేందుకు సందేహించే ప్రతి విషయం మీద గొంతు విప్పారు. బెజవాడ రాజకీయాలు, కమ్మ కాపు కులాల మధ్య వైరం, పరిటాల గుండు ఎపిసోడ్, జగన్ అవినీతి ఇలా ఒకటేమిటి తనకు తెలిసిన ప్రతి విషయం మీద పవన్ తన అభిప్రాయాలను చెప్పేసారు. ఆ అభిప్రాయాల్లో తప్పొప్పులు వెదికితే వెతకొచ్చు. కానీ ఏ విషయం గురించి పవన్ మాట్లాడలేదు అనే అవకాశం లేకుండా చూసుకున్నారు. చంద్రబాబు అవకాశవాదం, టీడీపీ కి మద్దతు వంటి అంశాల్లో కూడా తాను అనుకున్నది అనుకున్నట్టు చెప్పారు. కులాల మధ్య ఐక్యత కోసమే తాను టీడీపీ చేసిన తప్పులను పట్టించుకోలేదని కూడా పవన్ వివరించారు , ప్రతి విషయాన్ని ఇంత ఓపెన్ గా చెప్పిన పవన్ ఒక్క విషయాన్ని ఆలా టచ్ చేసి వదిలేశారు. ఆ రహస్యం గురించి ముందుకు వెళ్ళలేదు. ఇంతకీ ఆ రహస్యం ఏమిటి .

2014 ఎన్నికల్లో మోడీ , చంద్రబాబు గెలవకపోతే ఈ పాటికి నన్ను చంపేసి వుండే వాళ్ళు అని పవన్ చేసిన వ్యాఖ్యల లోగుట్టు ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. పవన్ తో రాజకీయ విభేదాలు ఉండొచ్చు గానీ ఆయన్ని చంపేంత కక్ష ఎవరికి ఉంటుంది?. ఈ మాట ఆయన ఓ ఫ్లో లో అలా అనేసారా లేక నిజంగా ఏదైనా అలాంటి కుట్ర పవన్ దృష్టికి వచ్చిందా ?. నిజంగా కుట్ర జరిగి ఉంటే దాని వెనుక వున్నది ఎవరు ?. పవన్ కామెంట్స్ తో అభిమానుల మదిలో ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు కూడా పవన్ సమాధానం చెబితే బాగుంటుంది. లేకుంటే పవన్ ఏదో రహస్యాన్ని దాచినట్టు అవుతుంది.