నయా లుక్ లో పవన్ కళ్యాణ్..ఫొటోస్ వైరల్.!

నయా లుక్ లో పవన్ కళ్యాణ్..ఫొటోస్ వైరల్.!
Cinema News

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు భారీ సినిమా లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్” లో తాను రీసెంట్ గానే జాయిన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ చిన్న బ్రేక్ లో ఉన్నారు. ఇక ఈ గ్యాప్ లో తన పాలిటిక్స్ పరంగా బిజీగా ఉన్న పవన్ ఈ కొన్ని రోజులు అయితే బయట పెద్దగా కనిపించట్లేదు .

నయా లుక్ లో  పవన్ కళ్యాణ్..ఫొటోస్ వైరల్.!
Pavan Kalyan

ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రిపేర్ చేసి ఉన్న లుక్ నుంచి ఇప్పుడు పవన్ బయటకి వచ్చినట్టుగా లేటెస్ట్ పిక్స్ తో అయితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ క్లీన్ షేవ్ లోకి వచ్చేసారు. దీనితో ఉస్తాద్ సహా ఓజి సినిమా లు రెండిటికీ కూడా బ్రేక్ ఇచ్చినట్టేనా అని అంటున్నారు . ఇప్పటి వరకు అయితే ఈ రెండు మూవీ ల్లో దేనికి కూడా క్లీన్ షేవ్ లుక్ లో కనిపించింది లేదు. మరి ఇది ఏ మూవీ కోసం అనేది పక్కన పెడితే పవన్ ఫ్రెష్ లుక్ మాత్రం ఫ్యాన్స్ లో వైరల్ గా మారిపోయింది .