త్రివిక్రమ్‌ ఇంతే.. నచ్చితే వదలడు

pawan-kalyans-and-trivikram

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ చేసిన వారితోనే సినిమాలు ఎక్కువగా చేస్తాడు అనే విషయం తెల్సిందే. త్రివిక్రమ్‌ కెరీర్‌లో ఎక్కువగా మహేష్‌, పవన్‌, అల్లు అర్జున్‌లతో సినిమాలు తీశాడు. అలాగే తన హీరోయిన్స్‌ను కూడా రిపీట్‌ చేశాడు. ఇలియానా, ఆ తర్వాత సమంతలను మళ్లీ మళ్లీ తన సినిమాలో హీరోయిన్స్‌గా బుక్‌ చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ ‘జులాయి’ చిత్రాన్ని నిర్మించిన రాధాకృష్ణ పద్దతి నచ్చడంతో ఆయనతోనే వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ‘జులాయి’ తర్వాత ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’ చిత్రాలు ఆయన నిర్మాణంలోనే త్రివిక్రమ్‌ చేశాడు. ప్రస్తుతం పవన్‌ 25వ చిత్రం కూడా రాధాకృష్ణ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

త్రివిక్రమ్‌కు ఎవరైనా నచ్చితే వారితో మళ్లీ మళ్లీ వర్క్‌ చేయాలని కోరుకుంటాడు. వారితో తనకు కంఫర్ట్‌ ఉంటే ఎన్ని సార్లు అయినా వర్క్‌ చేసేందుకు మొహమాట పడడు. ఇప్పటి వరకు త్రివిక్రమ్‌ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తూ వచ్చాడు. అయితే పవన్‌ 25వ చిత్రానికి మాత్రం దేవిశ్రీ అందుబాటులో లేకపోవడంతో తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు. అనిరుధ్‌ అందించిన సంగీతం త్రివిక్రమ్‌కు చాలా బాగా నచ్చింది. దాంతో ఆయనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే త్రివిక్రమ్‌ మరోసారి అనిరుద్‌తో వర్క్‌ చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ 25వ చిత్రం పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంగీత బాధ్యతను అనిరుధ్‌కు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అనిరుధ్‌కు ఎన్టీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. త్రివిక్రమ్‌, దేవిశ్రీల కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. అందుకే దేవిశ్రీ ప్రసాద్‌తో ఎన్టీఆర్‌ సినిమాకు సంగీతం చేయిస్తే బాగుండేది అని అంతా అనుకుంటున్నారు. కాని త్రివిక్రమ్‌కు మాత్రం బాగా తెతుసు. ఏ సినిమాకు ఏ సంగీత దర్శకుడు అయితే బాగుంటుంది. ఎన్టీఆర్‌ సినిమాకు అనిరుద్‌ ఇచ్చే సంగీతం ప్లస్‌ అవుతుందని త్రివిక్రమ్‌ చెబుతున్నాడు. వచ్చే సంవత్సరం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ సినిమా కోసం అప్పుడే రెండు ట్యూన్స్‌ను అనిరుధ్‌ రెడీ చేశాడని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. పవన్‌ 25వ చిత్రం ఆడియో సక్సెస్‌ అయితే అప్పుడు ఎన్టీఆర్‌ అభిమానుల్లో నమ్మకం కలుగుతుందేమో చూడాలి.