అక్కడ రోజుకు ఐదు షో లు…!

petta Viswasam To Be Screened 5 Shows Pongal Bonanza For Fans

తమిళనాడులో ఈ పొంగల్ కి అక్కడ రెండు పెద్ద సినిమాలు పోటిపడుతున్నాయి. అందులో శౌర్యం శివ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా నటించిన విశ్వాసం. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్సు రావడంతో సినిమా అంచనాలు పెరుగుతున్నాయి. మరొక్కటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేటా సినిమా కూడా విశ్వాసం సినిమాతో పోటి పడుతుంది. ఈ రెండు చిత్రాలు అక్కడ పొంగలికి విడుదల కావడంతో ఈ రెండు చిత్రాలను క్యాష్ చేసుకోవాలని ధియేటర్ యజమానులు ఎదురుచూస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ నెల 10 నుండి 20 వ తేది వరకు అధననంగా ఓ షో వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంటే రోజుకు అక్కడ 5 షో లతో సినిమా స్టార్ట్ అవ్వుతుంది.

విశ్వాసం సినిమా విషయానికి వస్తే దర్శకుడు శివ ఆల్రెడీ ఓ రెండు సినిమాల విజయాలతో మంచి ఫాం లో ఉన్నాడు. అందులోను ఆ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్నారు. తమిళ తలైవగా పిలుస్తున్నా రజినీకాంత్ పేటా సినిమాకూడా తమిళంతో పాటుగా, తెలుగు బాషలోను ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తెలుగులో అజిత్ కంటే రజినీకాంత్ కు ఎక్కువ ఫాన్స్ ఉన్నారు. పేటా సినిమా కానీ మొదటి రోజు మంచి టాక్ సంపాదించుకుంటే మాత్రం తెలుగు నాట సంక్రాంతికి విడుదలవుతున్నా ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2 సినిమా పై కలెక్షన్స్ ప్రభావం చూపిస్తుంది. వరస ప్లాప్స్ తో ఉన్న రజినీకాంత్ 2.౦ తో మంచి విజయాని అందుకున్నాడు. ఆ తరువాత వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై రెండు రాష్ట్రలోను పేటా సినిమా పై మంచి ప్రభావం ఉన్నది.