సైరా విడుదలపై క్లారిటీ ఇచ్చిన చరణ్…!

Boyapati Hurt With Ram Charan Letter To This Fans

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం మొదట జార్జియాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు మరియు యుద్ద సన్నివేశాలను హాలీవుడ్ యాక్షన్ ఫైటర్స్ సమక్షంలో రూపొందించారు. ఇకా ఈ చిత్రంలో వీర యోధుడు నరసింహా రెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నాడు. అతని భార్యగా నయనతార నటిస్తుంది. సౌత్ స్టార్స్ కొంత మంది ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ సేతుపతి, కిచ్చ సుదీప్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ చిత్రాని స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తోనిర్మిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క విడుదల తేది పై ఆ మద్య పలురకాల వార్తలు వచ్చాయి. వాటికీ అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ విడుదల తేదిపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

ఈ చిత్రం ఇంకో రెండు నెలలో షూటింగ్ పుర్తవ్వుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇంకో వన్ మంత్ టైం పడుతుంది. కావునా దసరా కానుకగా సైరా నరసింహా రెడ్డి చిత్రాని విడుదల చేస్తాం. ఆ తరువాత నాన్న గారు కొరటాల శివతో మా సొంత బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తాడు. దానికి సంబందించిన పనులు ఇప్పుడే స్టార్ట్ అవ్వుతున్నాయి. కొరటాల శివ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా ఉంటుంది. చిరంజీవి నటించే 153వ చిత్రం త్రివిక్రమ్ తోనే అనే రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇకా రామ్ చరణ్ వినయ విధేయ రామ చిత్రం ఈ నెల 10న విడుదల వుతుంది. అంటే ఇంకో రెండు రోజులు మాత్రమే. బోయపాటి ఈ చిత్రాని హై వోల్టైజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. కైరా అద్వాని రామ్ చరణ్ సరసన కథానాయకగా నటిస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.