అమిత్ త్రివేది కావాలంటున్న రెబల్ స్టార్…!

Prabhas Sahoo Movie Updates

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ నేపద్యంలోనే సాహో చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ హింది బాషలో ఆ చిత్రం రూపొందుతుంది. దుబాయ్ షెడ్యూల్ తరువాత ప్రభాస్ కొంత గ్యాప్ తీసుకుని జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటివరకు ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయకగా నటిస్తుంది. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుని తదుపరి షెడ్యూల్ కొరకు కొంత విరామం తీసుకుంది. ఆ తరువాత షెడ్యూల్ ఎక్కడ జరుగుతుంది అనేది త్వరలో తెలియనున్నది.

ఇప్పుడు ప్రభాస్, రాధాకృష్ణల చిత్రం నుండి అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకుంటున్నట్లు సమాచారం. ఆల్రెడీ అమిత్ త్రివేది. సురేందర్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో వస్తున్నా సైరా నరసింహా రెడ్డి చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సైరాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రమండమైన రెస్పాన్సు ఆడియన్స్ నుండి వస్తుంది. అందుకే ప్రభాస్, రాధాకృష్ణ సినిమాకు సంగీత దర్శకునిగా అమిత్ త్రివేదిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ప్రభాస్ సినిమాకు ఏలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలవుతుంది.