కబడ్డీ కెప్టన్ పైనే చేయేసిన.. పోలీస్ ఆపై సస్పెండ్

తెలంగాణలో ఈ లాక్ డౌన్ వేళ ఘోరాలు జరుగూనే ఉన్నాయి. కబడ్డీ ప్లేయర్ అయిన బాలికపై కానిస్టేబుల్ సురేందర్ అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల సాయంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు అతడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే  ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఉద్యోగుసే నీచానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతుంది. ఓ మైనర్ బాలికను అనేకసార్లు తరుచూ వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బయటకు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా అతడిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీచేశారు.అయితే అసలేం జరిగిందంటే.

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ బాలిక… తెలంగాణ రాష్ట్ర అండర్-14 కబడ్డీ
టీంకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ మధ్యనే జాతీయ కబడ్డీ పోటీలకు కూడా ఎంపికైంది. క‌బ‌డ్డీలో మ‌రింత ప‌ట్టు సాధించేందుకు జ‌గిత్యాల జిల్లా మ‌ల్యాల మండ‌లానికి పీఈటీ ఆదేశాల మేర‌కు రెండు, మూడు సార్లు ప్రత్యేక కోచింగ్ తీసుకుంది. ఆమెకు ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే సురేందర్‌ కోచింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆమెపట్ల అతడు పలుమార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడు.

ఆమెను లొంగదీసుకొనేందుకు చాలా సార్లు ప్రయత్నాలు చేశాడు.  అతడి  చేష్టలను పసిగట్టిన బాలిక కోచింగ్‌కు వెళ్లడం పూర్తిగా మానేసింది. కాగా ఈ మధ్య ధర్మపురిలో జరిగిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన రథోత్సవాన్ని చూసేందుకు బాలిక వెళ్లింది. అక్కడే విధుల్లో ఉన్న సురేందర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రైవేటు పార్ట్స్‌పై చేతులు వేస్తూ లైంగికంగా అత్యంత నీచానికి దిగజారాడు. అతడి నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు కూతురిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి సురేందర్‌పై ఫిర్యాదు చేశారు. సురేందర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీస్ ఖంగుతున్నాడు.