Political Updates: తెలంగాణలో ‘ప్రజాపాలన’కు రూ. 22.93 కోట్లు

TS Politics: Revanth's key decision... Free electricity only if dues are paid..!
TS Politics: Revanth's key decision... Free electricity only if dues are paid..!

ఈ నెల 28వ నుంచి జనవరి 6వ తేదీ వరకు తెలంగాణలో ప్రజా పాలన కొనసాగునున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 22.93 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 వేల చొప్పున మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు రూ. 12.77 కోట్లు, పురపాలక సంఘాల్లోని ఒక్కో వార్డుకు రూ. 10వేల చొప్పున 3,658 వార్డులకు రూ. 3.66 కోట్లు, ఒక్కో బృందానికి వాహనం కోసం రూ.20 వేల చొప్పున మొత్తం 3.20 కోట్లు, ఇతర ఖర్చుల కోసం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున రూ. 3.30 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. జిల్లా కలెక్టర్లు ఈ నిధులను వెచ్చించాలని సూచించింది.

అధికారులు రెండు బృందాలుగా ఏర్పడనున్నారు. ఒక బృందానికి తహశీల్దార్, మరో బృందానికి ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ నేతృత్వం వహిస్తారు. సుమారు పది శాఖల అధికారులతో కూడిన ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాలు లేదా రెండు వార్డుల్లో పర్యటించి ప్రజాసదస్సులు నిర్వహిస్తుంది.