Political Updates: రూ. 900 కోట్ల అప్పు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Political Updates: Rs. 900 Crores of Telangana State Govt
Political Updates: Rs. 900 Crores of Telangana State Govt

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 900 కోట్ల అప్పు తీసుకుంది. మంగళవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 7.58% వార్షిక వడ్డీ 18 ఏళ్ల కాలపరిమితితో ఈ అప్పు తీసుకుంది. తెలంగాణ సహ దేశంలోని 13 రాష్ట్రాలు మొత్తం రూ. 19,692 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి. ఏపీ సహా ఆరు రాష్ట్రాలు అదనపు రుణం పొందేందుకు అవకాశం కల్పించింది ఆర్‌బీఐ.

విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకుగాను అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. విద్యుత్ సంస్కరణల్లో ప్రధానంగా.. 3 అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకుగాను.. కేంద్రం ఈ అవకాశం కల్పించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో..12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా…తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సహా..ఆరు రాష్ట్రాలకు ఈ అవకాశం దక్కింది. 15వ ఆర్ధిక సంఘం సిపార్సుల మేరకు, మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ ప్రకటించింది.