అమెరికా వీధుల్లో పాప్ కార్న్ టీడీపీ అధినేత సందడి !

Popcorn TDP head on the streets of America!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికాలో పర్యటనలో సరదాగా గడుపుతున్నారు. మిన్నెసోట రాష్ట్రంలో మేయో క్లినిక్‌ లో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం చంద్రబాబును తెలుగు సంఘాల ప్రతినిధులు, ఎన్‌ఆర్‌ఐలు కలిశారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐలతో కలిసి చంద్రబాబు మిన్నెసోట వీధుల్లో సందడి చేశారు.

పాప్ కార్న్ తింటూ వీధుల్లో నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు జులై 28న రాత్రి అమెరికా బయల్దేరి వెళ్లిన ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో చంద్రబాబుకు ఎన్ని రోజుల తర్వాత కుటుంబంతో గడిపే అవకాశం దొరికిందంటూ టీడీపీ కార్యకర్తలు సంబరపడిపోయారు.

ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే తమ అధినేతను ఇలా చూడటం ఆనందంగా ఉందన్నారు. తాజాగా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.