ప్రభాస్‌ హెల్ప్‌తో అయినా సక్సెస్‌ దక్కేనా?

Prabhas come to Rescue Sumanth Ashwin

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో వారసులు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. వచ్చిన వారసులు అంతా కూడా సక్సెస్‌ను దక్కించుకోలేక కొన్నాళ్లకు ఫేడ్‌ అవుట్‌ అవుతున్నారు. కొందరు మాత్రం స్టార్‌ హీరోలుగా వెలుగు వెలుగుతున్నారు. ఒకప్పుడు స్టార్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పు చిత్రాల్లో నటించిన సుమంత్‌ అశ్విన్‌కు సరైన కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రం దక్కలేదు. చివరకు ఈయన వెబ్‌ సిరీస్‌లో కూడా నటించేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో సుమంత్‌ అశ్విన్‌కు బ్రేక్‌ ఇచ్చేందుకు ప్రభాస్‌ ముందుకు వచ్చాడు. తన మిత్రులకు చెందిన యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమాను సుమంత్‌ అశ్విన్‌ సినిమాను ప్రభాస్‌ ప్లాన్‌ చేశాడు.

prabhash

ప్రభాస్‌ నటించిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఆ తర్వాత ఎంఎస్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘వర్షం’ చిత్రం ప్రభాస్‌ రేంజ్‌ను మార్చేసింది. ఆ సినిమాతో రికార్డు స్థాయి విజయాన్ని అందుకున ప్రభాస్‌ అప్పటి రుణంను ఇప్పుడు ఆయన కొడుకుకు మంచి సక్సెస్‌ ఇచ్చి తీర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు యూవీ క్రియేషన్స్‌లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. ఈ చిత్రంతో అయినా సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌ గాడిలో పడుతుందేమో చూడాలి. ఒక వేళ ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయితే ఇక సుమంత్‌ కెరీర్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిందే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.