సుమ, ఓంకార్‌ తీసుకోవడం లేదా..?

posani-krishna-murali

 Posted November 13, 2017 at 17:11 

రచయిత పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం పూర్తి స్థాయి కమెడియన్‌గా మారిపోయాడు. పులు చిత్రాల్లో కమెడియన్‌గా నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న పోసాని కృష్ణ మురళి బుల్లి తెరపై వచ్చే గేమ్‌ షోలో పాల్గొనేందుకు లక్షల రూపాయల పారితోషికం డిమాండ్‌ చేస్తాడని, ఒక్క రోజు పోసాని డేట్స్‌ కావాలి అంటే లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అంటూ సినీ వర్గాల్లో మరియు బుల్లి తెర వర్గాల్లో టాక్‌ ఉంది. కొన్ని గేమ్‌ షోల్లో సెలబ్రెటీలు సరదాగా పాల్గొంటారు. కాని కొన్ని గేమ్‌ల్లో పాల్గొనేందుకు సెలబ్రెటీలు పారితోషికం తీసుకుంటారు. పెద్ద స్టార్స్‌ మాత్రం పారితోషికంపై ఆసక్తి చూపించరు. అయితే పోసాని మాత్రం ఏ చిన్న షో చేయమన్నా కూడా లక్ష రూపాయలు ఇస్తే చేస్తాను అంటాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పోసాని ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు.

posani-krishna-murali

తాజాగా పోసాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్‌ సుమ చేసే షోకు నన్ను ఆహ్వానించారు. పోసాని కృష్ణమురళికి ఉన్న క్రేజ్‌ను వారు వాడుకోవాలని భావించారు. మరి నా క్రేజ్‌ను నేను వాడుకోవద్ద.. ఆ షో చేస్తున్న సుమ పారితోషికం తీసుకోకుండా చేస్తోందా, అప్పుడు నేను ఎందుకు ఫ్రీగా చేయాలని అడిగాను. అప్పుడు వారు పారితోషికం ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఓంకార్‌ కూడా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని డాన్స్‌ షో చేశాడు. అప్పుడు నేనేందుకు ఆయన నుండి తీసుకోకూడదు అందుకే ఆటలో పాల్గొనేందుకు పారితోషికం తీసుకున్నాను అంటూ పోసాని చెప్పుకొచ్చాడు. నా వద్ద ఈ జన్మకు సరిపోయే డబ్బు ఉంది, అయినా కూడా వచ్చే డబ్బును మాత్రం వదులుకోను అంటూ పోసాని కుండబద్దలు కొట్టేశాడు. నాకు వస్తున్న డబ్బులో ఎంతో కొంత పేదలకు సాయం కూడా చేస్తాను అంటూ ఓంకార్‌ పేర్కొన్నాడు.

SHARE