బాబు కోసం టీడీపీలోకి చేరుతున్న చిరు హీరోయిన్…

Posted November 13, 2017 at 17:36 

ఎన్నో సినిమాలలో తన నటనతో, తన అందాలతో, తన అభినయంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు అందాల నటి వాణీ విశ్వనాధ్. చిరంజీవి రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన ఘరానామొగుడు చిత్రంలోని ‘కిటుకులు తెలిసిన చిటపట చినుకులు’ సాంగ్ లో తన అందాల ప్రదర్శన తో యువతలో బాగా క్రేజ్ సంపాదించుకున్నారు. గత 15 ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ బామ, ఇటీవలే రాజకీయలపై తనకున్న ఆసక్తిని తెలిపింది.

 vani viswanath announced to join in TDP party

ఎన్‌.బి.కె. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన వాణీ విశ్వనాథ్‌ మీడియాతో మాట్లాడారు. అనంతపురం ప్రజలు చూపిన అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నాకు చాలా ఇష్టం అని, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సినీనటి వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. తాను త్వరలో తెదేపాలో చేరనున్నట్లు ప్రకటించారు.

vani-vishwanzath-in-tdp

 

తాను త్వరలో టీడీపీ పార్టీలో చేరతానని, టీడీపీలో ఏ పాత్ర పోషించాలి, ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడు గారు మరిన్ని ఆంధ్రప్రదేశ్ ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెల్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి రావాలని తనకెప్పటి నుంచో ఉందని, తెలుగు ప్రజలపై ఉన్న అభిమానంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నని వాణీ విశ్వనాథ్‌ తెలిపారు. తాను రాజకీయాల్లోకి రాకపోయినా చంద్రబాబుకే మద్దతు తెలుపుతానని వాణీ విశ్వనాథ్‌ స్పష్టం చేశారు.

SHARE