శ్రీనువైట్ల, రవితేజ సినిమా ఏమైంది?

srinu vaitla with raviteja movie got a break

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మహేష్‌బాబుతో చేసిన ‘దూకుడు’ చిత్రం తర్వాత శ్రీనువైట్ల సక్సెస్‌ మొహం చూడలేదు. వరుసగా ‘బాద్‌షా’, ‘ఆగడు’, ‘బ్రూస్‌లీ’, ‘మిస్టర్‌’ చిత్రాలతో దారుణమైన పరాజయాలను మూట కట్టుకున్నాడు. మళ్లీ మళ్లీ ఫ్లాప్‌లు రావడంతో ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఏ ఒక్కరు ఆసక్తిగా లేదు. కాని రవితేజ మాత్రం గతంలో శ్రీనువైట్లతో ఉన్న అనుబంధం కారణంగా, కృతజ్ఞతతో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. ఒక మంచి సబ్జెక్ట్‌తో వస్తే ఖచ్చితంగా సినిమా చేద్దామని, నిర్మాతను కూడా తీసుకు రావాల్సిందిగా శ్రీనువైట్లకు రవితేజ సూచించడం జరిగింది.

srinu vaitla & ravi teja combo again

మొన్నటి వరకు రవితేజ కోసం ఒక మాస్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్దం చేసేందుకు తెగ చర్చలు జరిపిన శ్రీనువైట్ల ఉన్నట్లుండి రవితేజతో సినిమాను పక్కకు పెట్టాడు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అందుకే శ్రీనువైట్ల కూడా వెబ్‌ సిరీస్‌ను స్వీయ దర్శకత్వంలో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. రెండు వెబ్‌ సిరీస్‌లకు స్క్రిప్ట్‌లు కూడా సిద్దం అయినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన నటీనటుల ఎంపిక చేస్తున్నట్లుగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చాడు. సినిమాల్లో సక్సెస్‌లు దూరం అయిన నేపథ్యంలో శ్రీనువైట్లకు వెబ్‌ సిరీస్‌లు అయినా మునుపటి వైభవంను తెచ్చి పెడతాయో చూడాలి.