‘రావణాసుర’ ప్రీ రిలీజ్ థియేట్రిక‌ల్ బిజినెస్

‘రావణాసుర’ థియేట్రిక‌ల్ బిజినెస్
‘రావణాసుర’ థియేట్రిక‌ల్ బిజినెస్

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన థ్రిల్ల‌ర్ ఇది. ఇందులో సుశాంత్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమా థియేట్రిక‌ల్ బిజినెస్ ఎంత జ‌రిగింద‌నే విషయం పై ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు బాగా వినిపిస్తున్నాయి. స‌మాచారం ప్రకారం..నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, ఆంధ్రాలో రూ.10 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు థియేట్రిక‌ల్ బిజినెస్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఓవ‌ర్ సీస్‌లో రూ.2.20 కోట్ల‌కు హ‌క్కులు అమ్ముడ‌య్యాయి. సినిమా హిట్ అవ్వాలంటే రూ.23 కోట్లు క‌లెక్ష‌న్స్‌ను చేయాల్సి ఉంది. అలాగే రావ‌ణాసుర నిర్మాతలు ఈ సినిమాను థియేట‌ర్స్‌లో భారీగానే విడుద‌ల చేస్తున్నారు. నైజాంలో 235, సీడెడ్‌లో 165, ఆంధ్రాలో 300 థియేట‌ర్స్.. మొత్థం గా తెలుగు రాష్ట్రాల్లో 700 థియేట‌ర్స్‌లో సినిమా రిలీజ్ కానుంది. క‌ర్ణాట‌క ప్రాంతంలో 75, ఓవ‌ర్ సీస్‌లో 150 థియేట‌ర్స్‌లో విడుదల అవుతుంది. అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే 925 థియేట‌ర్స్‌లో రావణాసుర సినిమా విడుద‌లవుతుంది.

‘రావణాసుర’ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్, ఆర్‌టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా రూపొందించారు. తొలిసారి గ ఈ చిత్రం లో క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం ర‌వితేజ కొంత మంది లాయ‌ర్స్‌ను క‌లిసి వారి బాడీ లాంగ్వేజ్‌ను నేర్చుకుని మ‌రీ న‌టించటం విశేషం.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీకాంత్ విస్సా క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. అను ఇమ్మాన్యుయేల్‌, ద‌క్షా న‌గార్క‌ర్‌, ఫ‌రియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, కథానాయికలు గా న‌టించారు