అప్డేట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

అప్డేట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “సాహో” తర్వాత మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ అప్డేట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.సాహో ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఆ తర్వాత వచ్చే సినిమా అయినా సరే మంచి హిట్టు కావాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే ఈ చిత్రాన్ని “జిల్” ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కానీ ప్రభాస్ స్టార్డమ్ దృష్ట్యా ఈ చిత్రం కాన్సెప్ట్ పైనే ఇప్పుడు చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం మునుపటిలా భారీ యాక్షన్ థ్రిల్లర్ కాదు ప్యూర్ లవ్ స్టోరీ అని దర్శకుడు చెప్పాడు.దీనితో ఇది ఒక పాన్ ఇండియన్ చిత్రంగా వర్కౌట్ అవుతుందా అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి.కానీ ఇప్పటికే సరైన కంటెంట్ కానీ పడితే ఆ విజయం ఏ స్థాయిలో ఉంటుందో అని పలు లవ్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు నిరూపించాయి అని సినీ వర్గాలు చెప్తున్నాయి.అర్జున్ రెడ్డి,ప్రేమమ్,రాజా రాణి చిత్రాలలో ప్రేమ అనే కాన్సెప్ట్ ను ఎంత బలంగా చూపించారో మనం చూసాం అలా ఈ చిత్రంలో కూడా లవ్ ను తెరకెక్కించే విధానం కొత్త కోణంలో ఉంటుంది అని అందుకే దర్శకుడు అంత నమ్మకంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.