బాలీవుడ్ స్టార్ హీరోలా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్

బాలీవుడ్ స్టార్ హీరోలా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్

టాలీవుడ్ డార్లింగ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్డం బాహుబలి సినిమా తర్వాత అమాంతం పెరిగింది.దీనితో ఒక్కసారిగా ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయాడు.అలా మారిపోయే తన తర్వాత చిత్రం “సాహో” తో బాలీవుడ్ బడా హీరోలకు చెమటలు పట్టించాడు.అలా ఒక బాలీవుడ్ స్టార్ హీరోలా మారిపోయాడు.అయితే ప్రభాస్ కటౌట్ కు ఒక యాక్షన్ హీరోగా కరెక్ట్ గా సరిపోతాడని మనం ఇప్పటికే అనేక సినిమాల్లో చూసేసాం.

కానీ అతను బాలీవుడ్ స్టార్ హీరో రేంజ్ లో కూడా చేయగలడని “సాహో” ద్వారా ప్రూవ్ అయ్యింది.అయితే అలాంటి ప్రభాస్ బాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ సిరీస్ లో నటిస్తే ఎలా ఉంటుంది అనే ఊహ ఇప్పుడు నార్త్ ఇండియాలో మొదలయ్యింది.మన ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ సిరీస్ లలో “ధూమ్” ఒకటి.ఇప్పటికి మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఏ చిత్రంలో యాంటీ హీరో పాత్రే బిగ్గెస్ట్ ఎస్సెట్.

ఇప్పటి వరకు “పర్ఫెక్ట్ థీఫ్” రోల్స్ లో జాన్ అబ్రహం,హృతిక్ రోషన్ అలాగే అమీర్ ఖాన్ లు అద్భుతమైన యాక్షన్ పండించారు.మరి ఇప్పుడు “ధూమ్ 4″లో ఆ పర్ఫెక్ట్ థీఫ్ గా ఎవరు సరిపోతారు అన్నప్పుడు ప్రభాస్ పేరు కూడా ఇప్పుడు వినిపించడం గమనార్హం.అయితే ఇది ప్రస్తుతానికి బజ్ లానే ఉంది.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఆ రోల్ అత్యద్భుతంగా సెట్టయ్యిపోతారని చెప్పాలి.