“జాన్”గా రానున్న”డార్లింగ్”

అంతర్జాతీయ స్థాయిలో యంగ్ రెబెల్ స్టార్ కి ‘బాహుబలి’ సినిమా పేరు తెచ్చి పెట్టింది. పెదనాన్న కృష్టంరాజులా సినిమాల్లోకి రాకుంటే మంచి స్టార్ ని చూడలేకపోయేవాళ్ళం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ సినిమాల్లోకి వచ్చే ముందు తన తల్లి ఏదన్నా ఉద్యోగం చూసుకొమ్మని చెప్పారట. అమ్మకి నటన ఇష్టం లేదు కాబట్టి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ తనకంటూ ఓ ఇల్లు, ఉద్యోగం ఉండాలని అనుకున్నారట. ఇంట్లో సినిమా వాతావరణం వల్ల పెదనాన్న ముందే రెబెల్ హీరో కాబట్టి సినిమాల్లోకి వచ్చారు.ప్రభాస్ తల్లి బాహుబలి సినిమా చూసాక సక్సెస్ వల్ల తెలీకుండానే కళ్లు నెత్తికెక్కుతాయని, ఎప్పుడూ అలా ఉండకూడదు అని చెప్పారట.

ఏదిఏమైన ‘బాహుబలి’ సినిమా తర్వాత మంచి పేరు సంపాదించిన ప్రభాస్ ‘సాహో’ వల్ల అంతా విజయం సాదించలేకపోయాడు. ప్రస్తుతం రానున్న ‘జాన్’ తో హిట్ కోడతాడా అనేది చూడాలి.