విలన్ గా మారనున్న మాజీ క్రికెటర్

విలన్ గా మారనున్న మాజీ క్రికెటర్

హన్సిక సీరియళ్లలోను,సినిమాల్లోనూ చిన్నతనం లోనే నటించి చైల్డ్ఆ ర్టిస్ట్‌గా చాలా పేరు సంపాదించింది. ‘దేశముదురు’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హన్సిక తమిళంలో,హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో ప్రస్తుతం”తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్” లో నటిస్తుంది. అటు తమిళంలో మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీ గానే ఉంది.

హన్సిక హర్రర్ జానర్ సినిమాల్ని ఎక్కువగా ఇష్టపడుతుందట. అలాంటి ఒక మూవీ నే చేయబతున్నారట. విశేషం ఏమిటంటే ప్రతినాయకుడి పాత్రలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తున్నారట. గతంలో టీమ్5  అనే సినిమాలో శ్రీశాంత్ నటించారు. శ్రీశాంత్ ప్రతినాయకుడి పాత్రలో రానున్న ఈ చిత్రం గురించి చిత్ర బృందం మాట్లాడుతూ ఇందులో కామెడీ కూడా ఉంటుందని చెప్పారు. హరి శంకర్, హరీశ్ నారాయణ్ ఇద్దరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి రంగనాథన్ నిర్మాత. ఈ ముగ్గురు కలిసి స్క్రిప్ట్ చెప్పగానే శ్రీశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.