ప్రభాస్‌ ‘ప్రేమ’కన్ఫర్మ్‌…?

Prabhas Comments On Jr.Ntr

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘జిల్‌’ ఫైం రాదాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. తాజాగా ప్రభాస్‌ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఒక రొమాంటిక్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తునారు చిత్ర యూనిట్‌. ‘అమూర్‌’ అని టైటిల్‌ని ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. అమూర్‌ అనేది ఫ్రెంచి పదం, ఈ పదానికి అర్థం ప్రేమ. రొమాంటిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రేమ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు.

Bahubali 2

టైటిల్‌ పరభాష పదం కాబట్టి ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్‌ అవదు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అయితే ఇప్పటివరకైతే ఇదే టైటిల్‌ దృష్ట్యాఆలోచన చేస్తున్నారు. ‘బాహుబలి 2’ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్‌ కెరియర్‌ ‘బాహుబలి’ ముందు, తర్వాత అన్నట్టుగా ఉంది, దాంతో దర్శకుడు కూడా ఈ చిత్రంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.