అరవిందుడికి ఆ విషయం కూడా కలిసొచ్చింది…!

AP Government Also Helped Aravinda Sametha Movie

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అరవింద సమేత’ చిత్రం ఈ నెల 11న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఎన్టీఆర్‌కు చాలా ప్రత్యేకమైనది అని ఎన్టీఆర్‌ తాజాగా చెప్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం కూడా సహకరించింది. ఉదయం అయిదు గంటలకే షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా టికెట్‌ ధరను కూడా 200 పెంచడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సహజంగా అన్నీ చిత్రాలకు ఇలా ప్రత్యేక షోలు వేసుకోవడానికి మరియు టికెట్‌ ధరను పెంచడానికి అనుమతులు లభించవు.

aravindha-sametha

ఏపీ ప్రభుత్వం అందించిన ఈ సహకారం వల్ల అరవిందుడి బయ్యర్‌లు, డిస్ట్రిబ్యూటర్లు చాలా సంతోషసడుతున్నారు. షోల సంఖ్య పెరగడంతో పాటు టికెట్‌ ధర కూడా పెరగడం వారికి చాలా మేలు జరిగే అవకాశం ఉంది. హరిక్రిష్ణ మరణంతో జనాల్లో చాలా సింపతిని దక్కించుకున్న ఎన్టీఆర్‌కు ఇప్పుడు నో చెబితే అది రాజకీయంగా చాలా పెద్ద దెబ్బ పడుతుందని భావించిన ఏపీ ప్రభుత్వం ఈ రకంగా అరవిందుడికి సహకారం అందించింది.

NTR And Trivikram Movie Release Get Soon