ఆర్‌ఆర్‌ఆర్‌ మల్టీస్టారర్‌ అప్‌డేట్స్‌…!

Jr NTR RamCharan Rajamouli RRR Multi Starrer Movies

దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌ మరియు రామ్‌చరణ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు నత్త నడక నడిచాయి. కానీ ప్రస్తుతం ఈ చిత్ర పనులు శరవేగంగా జరగనున్నట్టు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి ఈ చిత్రంపై పూర్తి ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది.

rrr-movies

సహజంగా రాజమౌళి సినిమా అంటేనే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి ఆపై ఇద్దరు స్టార్‌ హీరోలతో మల్టీస్టారర్‌. ఇక ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ చిత్ర షూటింగ్‌ను డిసెంబర్‌లో మొదలుపెట్టి చకాచకా తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారు.

rrr-ram-ntr

తాజాగా రాజమౌళి దగ్గర నుండి చెర్రీకి, ఎన్టీఆర్‌కు పిలుపు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన వర్క్‌షాప్‌లో చెర్రీ ఎన్టీఆర్‌లతో పాటు రాజమౌళి మరియు సాంకేతిక బృందం అంతా పాల్గొనబోతున్నారు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని చాలా భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు జక్కన్న రాజమౌళి. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చెర్రీ, ఎన్టీఆర్‌లు సోదరులుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నారు.

rrr-rajamouli