తొమ్మిదినెలల గర్భిణీని చంపేసిన భర్త !

Husband Killed His Pregnant Wife At Vijayawada

ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే ఆమె ఊపిరి తీసాడు. అతని వివాహేతర సంబంధం విషయమై గట్టిగా ప్రశ్నించిన పాపానికి తొమ్మిది నెలల నిండు గర్భిణి అనే కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి హతమార్చా డు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు గ్యాస్‌ ట్రబుల్‌ తో భార్య చనిపోయిందని అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. అందుతున్న సమాచరం మేరకు గన్నవరం ఉపాధ్యాయనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఈడే రాణి అనే తొమ్మిది నెలల గర్భిణీ మృతి చెందినది. తనకన్నా రెండేళ్ళు పెద్దదైన రాణిని ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్న భర్తతో తరచూ మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో ఏడాదికి పెద్ద మనుషుల పంచాయితీతో విడిపోయారు.

Lovers
అయితే రెండు నెలలు తర్వాత తిరిగి కలుసుకుని కాపురం చేసుకుంటున్నప్పటికి రాంప్రసాద్‌ వివాహేతర సంబంధం విషయమై వీరి మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది నెలలు నిండిన గర్భిణి అయిన ఆమెకు ఈ నెల 10వ తేదీ డెలివరీ డేట్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చిన భర్తను రాణి గట్టిగా నిలదీయడంతో వీరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రాంప్రసాద్‌ నిండు గర్భిణీని గోడ వైపునకు నెట్టి చేతి వేలిముద్రలు పడకుండా నైటీతో ఆమె గొంతును నులిమి చంపేశాడు. అనంతరం తెలివిగా భార్య గ్యాస్‌ ట్రబుల్‌తో చనిపోయిందని ఆమె బంధువులకు కబురు చేయడంతో పాటు అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు తమదయిన స్టైల్ లో విచారించడంతో విషయం ఒప్పుకున్నాడు