ప్రియుడితో బైక్ మీద వెళుతున్న భార్య మీద లారీ ఎక్కించి చంపిన భర్త

husband killed wife ramanamma at cheepurupalli

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అనుమానం ఆ కుటుంబంలో విషం చిమ్మింది. భార్య పై అనుమానం పెంచుకున్న ఓ భర్త క్షణికావేశంలో కసాయిలా ప్రవర్తించాడు. తానో మనిషి అనే విషయం మరిచిపోయి అతికిరాతకంగా కట్టుకున్న భార్య మీదకి లారీ ఎక్కించి చంపేశాడు. ఘటన వివరాల్లోకి వెళితే . గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రేగాన రమణమ్మ(35) భార్యాభర్తలు వారిద్దరికీ ఇరవై ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తవిటయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం పదిహేను రోజులకోసారి ఇంటికి వస్తూ వెళ్తుంటాడు. గురువారం ఉదయం తవిటయ్య తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్ నుంచి లారీలో వస్తూ భార్యకు ఫోన్‌ చేశాడు. ఖర్చుకు డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు. డ్వాక్రా అప్పు చెల్లించేందుకు డబ్బు అవసరమని ఆమె చెప్పడంతో తాను హైవే మీదుగా ఒడిశా రాష్ట్రం గుణుపూరు వెళ్తున్నానని, శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులు ఇచ్చేసి వెళ్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన ఆమె కొద్దిసేపటి తర్వాత తనకు మరిది వరసైన రేగాన రామకృష్ణతో ద్విచక్ర వాహనంపై బయలుదేరింది.

రమణమ్మకు రామకృష్ణతో ఇంతకుముందే వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త తవిటయ్య చాలా కాలం కిందటే గుర్తించి భార్యను పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే చెప్పిన సమయానికి సుభద్రాపురం చేరుకుని భార్య కోసం ఎదురు చూశాడు. మధ్యాహ్నం వరకు భార్య రాకపోవడంతో మరోసారి ఇంటికి ఫోన్‌ చేశాడు. అప్పుడు కుమార్తె ఫోన్‌ లిఫ్ట్‌చేసి అమ్మ ఇప్పటికే బయలుదేరిందని బదులిచ్చింది. దీంతో తవిటయ్య స్వగ్రామం వైపు వెళ్లేందుకు లారీని తిప్పాడు. చీపురుపల్లి సమీపానికి వచ్చేసరికి రామకృష్ణతో రమణమ్మ బైక్‌పై వస్తుండడం చూశాడు. అప్పటికే అసహనంతో ఉన్న ఆయన వారిద్దరినీ చూసి తట్టుకోలేకపోయాడు. లారీని సరాసరి వారి మీదకు తీసుకెళ్లాడు. దీంతో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. తవిటయ్య లారీను అక్కడే వదిలి పరారయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్‌ చేయగా వారు క్షతగాత్రుని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రమణమ్మ మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి భార్య మృతికి కారణమైన తవిటయ్య పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. కాని ఆయన కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలోనే లారీని వదిలి పట్టణంలోకి వచ్చిన తవిటయ్య ఓ హోటల్‌లో మద్యం సేవించి భోజనం చేసి ఆ హోటల్‌ యాజమాన్యంతో గొడవ పడినట్లు తెలి సింది. దీంతో వారు హోటల్‌ నుంచి బయటకు గెంటేసినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అక్కడి నుంచి ఓ మద్యం దుకాణంలో మద్యం సేవిస్తూ ఉండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.