అప్పుడు దెయ్యం… ఇప్పుడు గొప్పగా కనిపిస్తోందా..?

Manish Tewari Comments on Pranab Mukherjee

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగపూర్‌ వేదికగా ఆరెస్సెస్‌ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగాన్ని భాజాపా నేతలు స్వాగతించి ప్రశంసిస్తున్నా ఆయన ఆ కార్యక్రమానికి వెళ్లడంపై పలువురు కాంగ్రెస్ నేతలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరుకావడాన్ని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ తప్పుపట్టారు. ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయాలనికి వెళ్లి జాతీయవాదంపై ప్రసంగం ఎందుకు ఇవ్వదలుచుకున్నారన్న తమ ప్రశ్నకు మీరు ఇంతవరకూ సమాధానం ఇవ్వకపోవడం లక్షలాది లౌకికవాదులను ఆందోళనకు గురిచేస్తున్నదని తివారీ పేర్కొన్నారు. ఆరెస్సెస్‌ కార్యకలాపాలను నిరసిస్తూ గతంలో తమకు శిక్షణ ఇచ్చిన పాతతరం కాంగ్రెస్‌ నేతగా ప్రణబ్‌ ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లారో చెప్పాలని నిలదీశారు. గతంలో దెయ్యంలా కనిపించిన ఆరెస్సెస్‌ ఇప్పుడు ధర్మసంస్థలా మారిందా అని ప్రణబ్‌ను ఆయన ప్రశ్నించారు.

కరడుగట్టిన కాంగ్రెస్‌ వాది, రాహుల్‌ గాంధీకి రాజగురువు అయిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి వెళ్లడంపై సోషల్‌ మీడియా అంతటా ప్రణబ్‌ను గురించిన చర్చే ఎక్కువగా నడిచింది. పెద్దాయన చర్యతో ఒళ్లుమండిన కాంగ్రెస్‌ నేతలు బర్నాల్(గాయాలకు పూసుకోడానికి) కోసం వెతుకులాడుతున్నారని అందుకే దుకాణాల్లో బర్నాల్ దొరకటంలేదు అని, బర్నాల్ తయారీ కంపెనీల షేర్లు విపరీతంగా దూసుకెళుతున్నాయని సెటైర్లు వేసింది. అయితే, ప్రణబ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతల సమక్షంలో వారి మౌలిక సిద్ధాంతాలపై సున్నిత విమర్శలు చేయడంతో సీన్‌ రివర్స్‌ అయింది. ‘‘ఇప్పుడా బర్నాల్ కావాల్సింది మీకే అంటూ కాంగ్రెస్‌ శిబిరం కౌంటర్ విసిరింది.