ఎన్టీఆర్‌ను కమెడియన్‌ తో ఇబ్బంది పెడుతున్న త్రివిక్రమ్‌

comedian srinivas reddy play key role in aravinda sametha movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంపై నందమూరి ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు కూడా ఉన్నారు. ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత త్రివిక్రమ్‌ ఇంకాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చే దాదాపు అన్ని సినిమాలో కూడా కమెడియన్‌ శ్రీనివాసరెడ్డి కనిపిస్తూ వస్తుంటాడు. కీలకమైన కామెడీ సీన్స్‌లలో శ్రీనివాస్‌ రెడ్డిని తీసుకుంటాడు. ఇప్పుడు అదే ఎన్టీఆర్‌కు ఇబ్బందిగా మారింది.

త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌ కొద్ది ఈ చిత్రంకు కూడా శ్రీనివాసరెడ్డిని తీసుకోవడం జరిగింది. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా శ్రీనివాసరెడ్డితో ఎన్టీఆర్‌ సరిగా ఉండటం లేదు. చాలా సంవత్సరాలుగా వీరిద్దరి మద్య కమ్యూనికేషన్‌ లేదు. అంతకు ముందు మంచి స్నేహితులు అయిన వీరిద్దరు ఏదో కారణం వల్ల విడిపోయారు. ఆ విషయం తెలిసో లేదా తెలియకనో కాని త్రివిక్రమ్‌ ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేశాడు. త్రివిక్రమ్‌ మాట కాదనలేక శ్రీనివాసరెడ్డితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఇటీవల వీరిద్దరి కాంబో సీన్స్‌ షూట్‌ జరుగుతుంది. ఆ సమయంలోనే ఈ విషయం అందరికి తెలిసింది. అందరితో ఉన్నట్లుగా శ్రీనివాసరెడ్డితో ఎన్టీఆర్‌ ఉండటం లేదు. దాంతో ఈ విషయం కాస్త వైరల్‌ అయ్యి అందరికి చేరింది. ఎన్టీఆర్‌కు ఇష్టం లేదని తెలిసి కూడా శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ త్రివిక్రమ్‌పై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు