అనుపమ పని ఇక అయిపోయినట్టేనా?

Anupama parameswaran Fading Out In Tollywood

మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన అనుపమ పరమేశ్వరన్‌ ఆ తర్వాత తన అందంతోను నటనతో ఆకట్టుకుంది. కానీ అంతలోనే ఈ అమ్మడికి ఆశించిన విజయాలు దక్కకపోవడంతో అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈమె నటించిన వరుస చిత్రాలు పరాజయం పాలవడంతో ఈ అమ్మడికి ప్రేక్షకుల్లో క్రేజ్‌ తగ్గిపోయింది. దాంతో అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. ఈ అమ్మడు రామ్‌తో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో నటించింది, ఆ చిత్రం పెద్దగా సక్సెస్‌ అవకపోయినా కూడా అనుపమ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

hello guru prema kosame

రామ్‌ తన తదుపరి చిత్రంలో కూడా అనుపమ పేరునే చెప్పాడు. నిర్మాత దిల్‌రాజు ఆ అవకాశాన్ని అనుపమకే ఇచ్చాడు. రామ్‌, దిల్‌రాజులకు కూడా సక్సెస్‌ రేటు అంతగా లేదు. ఈ ఇద్దరి కాంభోలో తెరకెక్కిన ‘హలోగురూ ప్రేమకోసమే’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్‌ సరసన అనుపమ నటించింది. ఈ ముగ్గురికి పెద్దగా సక్సెస్‌లు లేకపోవడంతో సినిమా గురించి పెద్దగా చర్చలు ఏమి లేవు అంతేకాకుండా పాటలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రం కూడా సక్సెస్‌ అవకపోతే అనుపమకు అవకాశాలు రావడం కష్టమే. వరుస ఫ్లాపుల పరంపర కొనసాగితే ఇక వారి పని అయిపోయినట్టే. ఇక అనుపమ సంగతి కూడా అంతే.