ఏనుగెక్కి జారిపడ్డ డిప్యూటీ స్పీకర్ !

Assam Deputy Speaker Falls During Elephant Ride

అంబారీ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ స్పీకర్ గజరాజుపైకి ఎక్కి సవారీ చేయబోతే ఏనుగు పరుగులు పెట్టడంతో పాపం కొత్త ఉప సభాపతి కిందపడిపోయాడు. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృపానాథ్‌ మల్లాహ్‌ మూడు రోజుల క్రితమే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఘనంగా స్వాగతం పలకాలనుకున్నారు.స్వాగత కార్యక్రమాల్లో భాగంగా.. ఆయన కోసం అంబారీని కూడా తెప్పించారు.

Elephantine fall for Deputy Speaker

ఆయన్ను అంబారీ ఎక్కించారు. మావటి ఏనుగును కంట్రోల్ చేస్తుండగా.. డిప్యూటీ స్పీకర్ వెనుక కూర్చున్నారు. ఊరేగింపు మొదలుకాగానే.. ఉన్నట్టుండి ఏనుగు బెదిరిపోయింది. అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో మావటితో పాటూ డిప్యూటీ స్పీకర్ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పరుగున ఆయన దగ్గరకు వెళ్లారు.. పైకి లేపారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సీన్ మొత్తాన్ని అక్కడే ఉన్న స్థానికులు, మీడియా ప్రతినిధులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.