‘ఎన్టీఆర్’తో ప్రశాంత్ నీల్ సినిమా అప్పుడే !

‘ఎన్టీఆర్’తో ప్రశాంత్ నీల్ సినిమా అప్పుడే !
Cinema news

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీ షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘వార్ 2’ కి డేట్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. మరోపక్క ప్రశాంత్ నీల్ తో చేయబోయే మూవీ కి డేట్స్ ఇచ్చాడని అంటున్నారు. ఏది ఏమైనా ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీ రాబోతుంది. డిసెంబర్ నాలుగో వారం తర్వాత ఈ మూవీ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రశాంత్ నీల్ బయటకు రాబోతున్నాడు.

‘ఎన్టీఆర్’తో ప్రశాంత్ నీల్ సినిమా అప్పుడే !
NTR-31

కాబట్టి, జనవరి ఎండింగ్ నుంచి ఎన్టీఆర్ తో తాను చేయబోయే మూవీని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. 2025 సమ్మర్ టార్గెట్ గా తమ మూవీను రిలీజ్ చేయాలి అనేది ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ ప్లాన్ అంట . మొత్తానికి ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదొక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ప్రియాంక చోప్రా నటించబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. నిజానికి ఈ మూవీ కు సంబంధించి ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదు.