ట్విట్ట‌ర్ లో మ‌హేశ్ కు న‌ల‌భై ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్లు

prince-mahesh-babu-reaches-4-million-followers-on-twitter

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ లో మ‌రో రికార్డు సృష్టించాడు. ట్విట్ట‌ర్ లో మ‌హేష్ బాబు ఫాలోవ‌ర్ల సంఖ్య నాలుగు మిలియ‌న్లు దాటింది. ట్విట్ట‌ర్ లో ఎక్కువ‌మంది ఫాలోవ‌ర్లు ఉన్నతెలుగు హీరో మహేష్ బాబే. ఎక్కువ‌గా లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ లోనూ పెద్ద యాక్టివ్ గా ఉండ‌రు. చాలా అరుదుగా మాత్ర‌మే ట్విట్ట‌ర్ లో పోస్టులు చేస్తుంటారు. కుటుంబం, సినిమాల‌కు సంబంధించిన అతి ముఖ్య‌మైన విష‌యాల‌పైనే ఆయ‌న పోస్టులు ఉంటాయి.

ట్విట్ట‌ర్ లో మ‌హేశ్ కు న‌ల‌భై ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్లు - Telugu Bullet

స్పైడ‌ర్ సినిమా సంగ‌తులు కొన్నింటిని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు మ‌హేశ్. అలాగే రీసెంట్ గా స్పైడ‌ర్ సినిమాలోని ఎస్పీవై ర‌య్ ర‌య్ ర‌య్ అనే పాట‌ను త‌న కూతురు సితార హ‌మ్ చేస్తున్న వీడియోను మ‌హేశ్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గానే…అది వైర‌ల్ అయింది. ఇలా సినిమా రిలీజ్ స‌మ‌యంలోనూ, కొత్త సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్పు డు మాత్ర‌మే మ‌హేశ్ ట్విట్ట‌ర్ లో పోస్టులు చేస్తుంటాడు. ఇక సామాజిక స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న ఒక్క‌సారి కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించ‌లేదు. అయినా ట్విట్ట‌ర్ లో …మ‌హేశ్ ఫాలోవ‌ర్ల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా వారి సంఖ్య న‌ల‌భై ల‌క్ష‌లు దాటింది.

ట్విట్ట‌ర్ లో మ‌హేశ్ కు న‌ల‌భై ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్లు - Telugu Bullet