శ్రీదేవికి ప్రియా ప్ర‌కాశ్ నివాళి

Priya Warrier Pays A Musical Tribute To Sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీదేవికి సామాన్యులూ, సెల‌బ్రిటీలు ఘ‌న‌నివాళి అర్పిస్తున్నారు. ప‌లువురు సెల‌బ్రిటీలు ఆమె భౌతిక‌కాయాన్ని ద‌ర్శించి, నివాళుల‌ర్పించ‌గా… మ‌రికొంద‌రు సోష‌ల్ మీడియాలో త‌మ అభిమాన న‌టికి అంజ‌లి ఘ‌టిస్తున్నారు. తాజాగా ఓవ‌ర్ నైట్ ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్ ప్రియాప్ర‌కాశ్ వారియర్ ఓ పాట‌రూపంలో శ్రీదేవికి నివాళుల‌ర్పించింది. క‌ర‌ణ్ జోహార్ తెర‌కెక్కించిన క‌భి అల్విదా నా కెహ‌నా చిత్రంలోని తుమ్ క‌భి హై ఖ‌బ‌ర్ ముఝ్ కో భి… హో ర‌హో హే జుదా… పాట విషాదంగా ఆల‌పిస్తూ నివాళుల‌ర్పించింది. చ‌రిత్ర ఎప్పుడూ వీడ్కోలు ప‌ల‌క‌దు… కేవ‌లం త‌ర్వాత క‌లుద్దాం అన్న‌ది ఈ పాట అర్దం.

శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త తెలిసి తాను షాక‌యిన‌ట్టు ప్రియ తెలిపింది. శ్రీదేవి మ‌ర‌ణం గుండెప‌గిలే వార్త‌ని, షాక్ కు గుర‌య్యాన‌ని, ఆమె ఎల్ల‌ప్పుడూ మ‌న గుండెల్లో బ‌తికే ఉంటారని, ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆమె కుటుంబానికి మ‌నో ధైర్యం క‌ల‌గాల‌ని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను అని ప్రియ ట్వీట్ చేశారు. శ్రీదేవి క‌న్నుమూసిన త‌ర్వాత ఆమె గురించి చెప్పే క్ర‌మంలో కొంద‌రు ప్రియాప్రకాశ్ ను ప్ర‌స్తావించారు. ప్రియ క‌న్నుకొట్టిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎంత సెన్సేష‌న్ అయిందో… అంత‌క‌న్నా ఎక్కువ‌గా… కొన్ని ద‌శాబ్దాల క్రిత‌మే… సోష‌ల్ మీడియా లేని రోజుల్లో క‌న్నుకొట్టడం ద్వారా శ్రీదేవి ఎంద‌రో యువ‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింద‌ని వ‌ర్ణించారు.