శ్రీదేవికి సంతాపంగా హోలీ వేడుక‌లు ర‌ద్దు

Mumbai doesn't Celebrate Holi because of Sridevi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీదేవికి స్థానికులు ఘ‌న‌నివాళి అర్పిస్తున్నారు. ముంబైలో శ్రీదేవి నివ‌సించిన లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని గ్రీన్ ఏక‌ర్స్ సొసైటీ శ్రీదేవి మృతికి సంతాపంగా హోలీ సంబ‌రాలు ర‌ద్దుచేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. త‌న న‌ట‌న‌తో యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆక‌ట్టుకున్న త‌మ సొసైటీ స‌భ్యురాలు మృతికి సంతాపసూచ‌కంగా తాము హోలీవేడుక‌ల‌ను ర‌ద్దుచేశామ‌ని పేర్కొంటూ సొసైటీ చైర్మ‌న్ ఓ లేఖ విడుద‌ల‌చేశారు. హోలీ రోజున త‌మ సొసైటీలో రంగులు చ‌ల్లుకోవ‌డం, రెయిన్ డ్యాన్స్, మ్యూజిక్ లాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోమని లేఖ‌లో తెలిపారు. మామూలుగా ఉత్త‌రాదివారు హోలీ వేడుక‌ల‌ను ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితులు అంతా ఒక‌చోట‌చేరి ఉల్లాసంగా గ‌డుపుతారు. రంగులు పూసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ… ఎంతో ఆనందంగా ఉంటారు. హోలీ ఉత్త‌రాదివారికి పెద్ద పండుగ‌. అలాంటి పండుగ‌ను శ్రీదేవికి సంతాపంగా గ్రీన్ ఏక‌ర్స్ సొసైటీ చేసుకోవ‌డం మానేస్తోందంటే… ఆమె అంటే స్థానికులకు ఎంత ఇష్ట‌మో అర్థం చేసుకోవ‌చ్చు.