ఆందోళనలో రంగస్థలం నిర్మాతలు?

Rangasthalam Movie Producer worried About On AP Theaters Bandh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న రంగస్థలం చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భారీ స్థాయిలో అంచనాలున్న ‘రంగస్థలం’ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఇక ఈ చిత్రం మెగా హీరోల చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించబోతున్న చిత్రం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. సుకుమార్‌ ఖచ్చితంగా ఏదో మ్యాజిక్‌ చేసి ఉంటాడు అని, చరణ్‌, సమంతలతో అద్బుతాన్ని ఆవిష్కరించే ఉంటాడు అంటూ ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు.

మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘రంగస్థలం’ చిత్రం విడుదల అటు ఇటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా థియేటర్ల యాజమాన్యంకు మరియు డిజిటల్‌ ప్రొవైడర్లకు మద్య వార్‌ జరుగుతుంది. డిజిటల్‌ ప్రొవైడర్లు రేట్లు తగ్గించుకోకుంటే థియేటర్ల బంద్‌ తప్పదని ఇప్పటికే సంఘం ప్రకటించింది. అయితే రంగస్థలం చిత్రం విడుదల ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ఏం పర్వాలేదని నిన్న మొన్నటి వరకు అంతా భావించారు. కాని థియేటర్ల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని, మార్చి చివర్లో నిర్మాతలను ఒత్తిడి చేసేలా బంద్‌ చేయాలని భావించారట. మార్చి చివర థియేటర్ల బంద్‌ అయితే రంగస్థలం చిత్రానికి తీవ్ర స్థాయిలో నష్టం ఖాయం. అందుకే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. మార్చి చివర్లోనే థియేటర్ల బంద్‌ ఉంటే రంగస్థలం చిత్రం వాయిదా వేయాల్సిందే అని సినీ వర్గాల వారు అంటున్నారు.