ఇక సెలవంటూ వెళ్లిపోయిన అతిలోక‌సుంద‌రి

Sridevi Funeral Compleated

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీదేవి చివ‌రి మ‌జిలీ ముగిసింది. ముంబ‌యిలోని విల్లే పార్లే స‌మాజ్ సేవా హిందూ శ్మ‌శాన‌వాటిక‌లో శ్రీదేవి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, ప‌లువురు సెల‌బ్రిటీలు, అశేషంగా త‌ర‌లివ‌చ్చిన అభిమానులు శ్రీదేవికి క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. అంత్య‌క్రియ‌ల‌కు మీడియాను అనుమ‌తించ‌లేదు. అంత‌కుముందు సెల‌బ్రిటీ క్ల‌బ్ నుంచి ఏడు కిలోమీట‌ర్ల మేర శ్రీదేవి అంతిమ‌యాత్ర సాగింది. దేశం నలుమూల‌ల నుంచీ త‌ర‌లివ‌చ్చిన అభిమానులు, అనేక భాష‌ల సినీ ప్ర‌ముఖులూ అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. అశేష జ‌న‌వాహినితో ముంబై ప‌రిస‌రాలు కిక్కిరిసాయి. ఇక సెల‌వంటూ వెళ్లిపోతున్న అతిలోక‌సుంద‌రిని త‌ల‌చుకుని అభిమానులు క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు.