బీజేపీతో పొత్తు లేదన్న చంద్రబాబు…

Chandrababu Quit to alliance with BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను ఆయన కలిశారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పెట్టుకున్నాం. మనం ఇరవై సీట్లు గెలిచాం. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించాం. తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని వాళ్లే ప్రకటించారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏది చేసినా చెప్పి చేయాలి. కానీ బీజేపీ అలా చేయలేదు.
 
35 సంవత్సాలుగా నన్ను నమ్ముకున్న కార్యకర్తల్ని కాపాడే బాధ్యత నాపై ఉంది. అదేసమయంలో తెలుగువారి కోసం పెట్టిన పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోవాలి. అందుకే నేను ఎక్కడా రాజీపడలేదు. అయితే పని ఒత్తిడి వల్ల నేను ఎక్కువగా రాలేకపోతున్నా. భవిష్యత్తులో తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటానని చాలా మీటింగుల్లో చెప్పా.
 
తెలంగాణలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు నాకెప్పడు గుర్తుంటారు. ఎన్నో త్యాగాలు చేశారు. ఎన్నో విధాలుగా పోరాటాలు చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తెలంగాణలో తీవ్రవాద సమస్యతో కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీని వదిలిపెట్టలేదు. రాజకీయ కక్షలో చాలావరకూ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధింపులకు గురిచేసినా, మా ఆస్తులు పోయినా పర్వాలేదని, కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. కొంతమందినాయకులు పోయారు. కానీ కార్యకర్తలు పార్టీని నమ్ముకోని ఉన్నారు.
 
అందుకని నేను ఒకటే చెబుతున్నా. నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటే తెలుగుదేశం పార్టీని తప్పకుండా ఆదరిస్తారు. మళ్లీ పాత రోజులు వస్తాయి.అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని గతంలోనే టీటీడీపీ అధ్యక్షుడు రమణకి చెప్పాను. రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి.’’ అని అన్నారు.