తెలుగు హీరోలు గ్రేట్‌ : తమిళ నిర్మాత

Producer Gnanavel Raja Prises Telugu Heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళంలో స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ టాప్‌ నిర్మాతగా పేరు తెచ్చుకున్న జ్ఞాన్‌వేల్‌ రాజా ప్రస్తుతం తెలుగులో కూడా సినిమాలు నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే తెలుగులో పలు తమిళ చిత్రాలను విడుదల చేసిన జ్ఞానవేల్‌ రాజా త్వరలో ఒక డైరెక్ట్‌ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక తాజాగా జ్ఞానవేల్‌ రాజా తెలుగు హీరోలపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో తమిళ హీరోలు స్వార్థ పరులు అంటూ సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.

తాజాగా ఒకానొక సమయంలో జ్ఞాన్‌వేల్‌ రాజా మీడియాతో మాట్లాడుతూ… తెలుగులో 100 కోట్లు వసూళ్లు చేయగల సామర్థ్యం ఉన్న హీరోలు కూడా పారితోషికంగా 15 నుండి 20 కోట్లు మాత్రమే తీసుకుంటారు. కాని తమిళంలో మాత్రం హీరోలు 40 నుండి 60 కోట్ల వరకు తీసుకుంటారని చెప్పుకొచ్చాడు. కోట్లు పారితోషికం తీసుకునే హీరో కూడా కేవలం అయిదు లక్షల అడ్వాన్స్‌కు మాటపై నిలబడుతారు అంటూ తెలుగు హీరోలను ఉద్దేశించి జ్ఞానవేల్‌ రాజా చెప్పుకొచ్చాడు. తమిళ హీరోలు మాత్రం అడ్వాన్స్‌గానే కోట్లు కావాలంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి జ్ఞానవేల్‌ రాజా ఒక వైపు తెలుగు హీరోలను ఆకాశానికి ఎత్తుతూనే మరో వైపు తమిళ హీరోల పరువు బజారున పడేశాడు. జ్ఞానవేల్‌ రాజాపై తమిళ హీరోలు సీరియస్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.