భరత్‌ ఇంకా డేంజర్‌ జోన్‌లోనే!

Bharat Ane Nenu Movie Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే. కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసి మొదటి వారంతంలో 130 కోట్లను వసూళ్లు చేసిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ దిశగా దూసుకు పోతుంది. ఇంతగా కలెక్షన్స్‌ను వసూళ్లు చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లను బయట పడేయలేక పోయిందని, మరో 60 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు బయట పడటం సాధ్యం కాదని సినీ వర్గాల వారు అంటున్నారు. సినిమాపై నమ్మకంతో ఏకంగా 100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను ఈ చిత్రం చేసింది. ఒక తెలుగు సినిమా షేర్‌ 100 కోట్లు రాబట్టాలి అంటే అంత సులభమైన విషయం కాదు. కాని మహేష్‌కు అది సాధ్యం అని డిస్ట్రిబ్యూటర్లు భావించారు.

తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర ఏరియాల్లో ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు కిందా మీదా పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో పెట్టిన పెట్టుబడి దగ్గరకు వచ్చింది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం కొనుగోలు చేసిన మొత్తం కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో పాటు, సమ్మర్‌ హాలీడేస్‌ అయినా కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రావడం లేదని, ఆంధ్రాకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భారీ ఎత్తున నష్టాలు లేకపోయినా కూడా కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు లక్షల్లో అయినా నష్టపోయే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక నైజాం ఏరియాలో కూడా కాస్త అటు ఇటుగానే వసూళ్లు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్‌కు భారీ లాభం రావడం అసాధ్యం అని ట్రేడ్‌ పండితులు అంటున్నారు. అందరు డిస్ట్రిబ్యూటర్‌లు ప్రస్తుతం డేంజర్‌ జోన్‌లోనే ఉన్నారు. మరో వారం పది రోజులు కలెక్షన్స్‌ జోరు కొనసాగితే తప్ప వారు అంతా కూడా సేఫ్‌ అవ్వరు.