టాలీవుడ్ హీరోల ఎమెర్జెన్సీ మీటింగ్…అందుకేనా ?

reason behind tollywood heros meeting at annapurna studio

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా తెలుగు సినిమా అంటేనే జనాల్లో ఏహ్యభావం వచ్చేలా ఉందని ఇకనైనా ఇటువంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలు నిర్ణయించినట్లు, దానికి తగ్గట్టు అలా ఏహ్య భావం వచ్చేలా చేసిన న్యూస్ చానెల్స్ ని టాలీవుడ్ బ్యాన్ చేస్తున్నట్టు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. కాని దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే సినీ పరిశ్రమ వారు ఎవరు కూడా ద్రువీకరించలేదు. అయితే నిన్న ఈ విషయమై టాలీవుడ్ కు చెందిన అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మా సభ్యలు కూడా కొందరు ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. టీవీ చానళ్లు మొత్తం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయని, పరిశ్రమ నుంచి వాటికి ఎటువంటి సహకారం అందకుంటే దార్లోకి వస్తాయని కొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా కొద్దిరోజుల క్రితం ఒక న్యూస్ చానల్ ఎక్సిక్యుటివ్ ఎడిటర్ సినిమా వాళ్లకు సంబంధించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, కించపరిచే విధంగా వ్యవహరించడం అలాగే సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద ద్రుష్టి పెట్టి వారిని తక్కువ చేసి చూపిస్తున్నాయని అందువల్ల ఇకపై న్యూస్ చానెల్స్ లో సినిమాలకు సంబందించిన ప్రోగ్రాంలు, ట్రైలర్ లు, టీజర్ లు, సినీ ప్రకటనలు, ఆడియో ఫంక్షన్ లు ఇలా సినిమాలకు సంబంధించి ఎటువంటివి ప్రసారం లేకుండా చేయాలని భేటీలో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సమావేశానికి చిరంజీవి నేతృత్వం వహించగా వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్, రాంచరణ్, రామ్, నాని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, సుమంత్‌, నాగబాబు, రాజ్‌తరుణ్ తదితర హీరోలతో పాటు కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, బీవీఎస్ ఎన్ ప్రసాద్, జీవిత రాజశేఖర్, మంచులక్ష్మీలతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా హాజరయినట్టుగా చెబుతున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో పవన్.. బాలయ్య మినహా దాదాపు టాప్ హీరోలంతా ఈ భేటీకి హారయినట్టు సమాచారం. పరిశ్రమలో ఇకపై ఏ సమస్య వచ్చినా గ్రూపులుగా విడిపోకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని భేటీలో నిర్ణయించారని తెలుస్తోంది. అసలు శ్రీరెడ్డి వ్యవహారం ఇక్కడవరకు వచ్చేదాకా ఉండకుండా, మొదట్లోనే సరైన పరిష్కారం చూపినట్లైతే బాగుండేదని కొందరు అభిప్రాయ పడ్డారట.

దాదాపు మూడు నాలు గంటలు జరిగిన ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మరో రెండు మూడు రొజులలో మరలా సమావేశమయి ఒక నిర్ణయానికి రావాలని వారు అనుకున్నట్టు తెలుస్తోంది. హీరోల భేటీకి మీడియాకు అనుమతి ఇవ్వలేదు. భేటీ వివరాలు ప్రస్తుతానికి మీడియాకు చెప్పకూడదని.. తుది నిర్ణయం తీసుకున్నాక, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ద్వారానే ప్రకటించాలని టాలీవుడ్‌ ప్రముఖులు నిశ్చయించినట్లు తెలిసింది. అయితే న్యూస్ చానెళ్ల మీద టాలీవుడ్ బ్యాన్ విధిస్తే అది ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న నిర్ణ‌యాన్ని సమర్ధిస్తూ చేసిన నిర్ణయంగా ఉంటుంది, అదీ కాక ఈ సమావేశం పవన్ అన్న చిరంజీవి నేతృత్వంలో జరగడం ఇప్పుడు కొన్ని అనుమానాలని రేకెత్తిస్తోంది. ఒక వేళ పవన్ కి మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు పవన్ వరకు వచ్చిన న్యూస్ చానెళ్ళు రేపు మన వరకు ఎందుకు రావు ? అనే అంశంతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే తాటిమీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమయినా ఈ పరిణామం ఇంకెన్ని అంశాలకి దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ నిర్ణయానికి ఎవరెవరు సహకరిస్తారు అనేది వేచి చూడాలి.