రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలపై కేసీఆర్‌ దృష్టి

Producer rejects KCR's proposal

హైదరాబాద్‌ నగరం రోజు రోజుకు భారీగా విస్తరిస్తూ ఉంది. నగరం మద్యలో ఉన్న పలు పెద్ద ఖాళీ స్థలాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాదీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అవసరాలకు మరియు ప్రజా అవసరాలకు ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే 1980 కాలంలో నిర్మించబడ్డ రామానాయుడు స్టూడియోను మరియు అన్నపూర్ణ స్టూడియోలను స్వాదీనం చేసుకోవాలని కేసీఆర్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ రెండు స్టూడియోలు భారీ విస్తీర్ణంలో ఉన్న కారణంగా ఆ స్థలంలో ప్రజా అవసరాలకు వీలుగా భవనాలను నిర్మించాలని కేసీఆర్‌ ప్రతిపాధన తీసుకు వచ్చాడు.

ఆ రెండు స్టూడియోలు అప్పగిస్తే అ స్టూడియోల విస్తీర్ణంకు డబుల్‌ భూమిని వారికి హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఇవ్వడంతో పాటు, స్టూడియోల నిర్మాణంకు ఆర్థిక సాయం కూడా చేసేందుకు సిద్దం అయ్యారు. ఇదే ప్రతిపాదనతో ఇప్పటికే కొందరు ప్రభుత్వ ప్రతినిధులు రామానాయుడు స్టూడియో మరియు అన్నపూర్ణ స్టూడియో అధినేతలను కలవడం జరిగింది. అయితే ఇరు స్టూడియోల అధినేతలు కూడా ప్రభుత్వ ప్రతిపాధనను తోసి పుచ్చారు. ఎంతో కాలంగా ఉన్న ఈ స్టూడియోలను తిరిగి నిర్మించడం అంత సులభం అయిన విషయం కాదని, హైదరాబాద్‌ శివార్లో స్టూడియోల వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదు అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లుగా జరిగే అవకాశం లేదు.