ఆవుపాల వల్ల ఎంత మేలంటే ?

benefits of Cow's milk

ఆవు నుంచి వచ్చే పాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో చూద్దాం. ఆవు పాల వెన్నలో ఉండే చక్కెరకు దీర్ఘకాలిక జ్వరాన్ని నయం చేసే గుణము ఉంటుంది. బంగారు రేణువుల ధూళి, తేనెను ఆవు నెయ్యితో కలుపు కొని తింటే క్షయ వ్యాధి నయమవుతుంది. దీంతోపాటు ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువుగా ఉండటం వలన ఇవి మన శరీర బరువును తగ్గిస్తాయి. ఆవు పాలు పలచగా ఉండటం వలన ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. నువ్వుల గింజలను ఆవు నెయ్యితో కలుపుకొని తింటే మొలల వ్యాధి నయం అవుతుంది. రక్తము కారే మూలవ్యాధి నివారణకై ఆవుపాల వెన్న, కుంకుమపువ్వు, చక్కెరల మిశ్రమాన్ని తింటే మంచిది. శరీరానికి ఇది బలవర్ధకమైనది. ఆవు పాలలో ఎ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పాలను పిల్లలకు తరచూ ఇవ్వటం వలన జ్ఞాపకశక్తి బాగా వృద్ధి చెందుతుంది. ఆవు పాలలో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువుగా ఉండటం వలన తరచూ ఆవు పాలు త్రాగే వారిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. సో మనం వాడే పాలు ఆవు పాలు అయితే మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.