ఆ ఫోన్ దెబ్బకి వన్ ప్లస్ కూడా దిగొచ్చింది!

high discount for oneplus 6

చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్‌ కంపెనీ తాజాగా లాంచ్‌ చేసిన తన వన్‌ప్లస్‌ 6 డిస్కౌంట్‌ ధరలో ఇప్పుడు అందుబాటులో ఉంది. అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లాట్‌ 2000 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ తన ఇండియా సైట్‌లో అందుబాటులో ఉంచింది. వన్‌ప్లస్‌ 6ను కొనుగోలు చేసిన వారికి వెంటనే ఈ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. జూలై 4 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్‌, జూలై 15 వరకు అందుబాటులో ఉండనుంది. ​

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలకు ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈఎంఐ ఆఫర్‌ మాత్రమే వాలిడ్‌లో ఉంది. ఈ ఆఫర్‌ కేవలం అమెజాన్‌ ఇండియా సైట్‌లో మాత్రమే ఉంది. వన్‌ప్లస్‌ స్టోర్‌లో ఈ ఆఫర్లు లేవు. అసుస్ నుంచి Asus Zenfone 5Z మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో కంపెనీ ఈ రకమైన తగ్గింపును చేపట్టినట్లు తెలుస్తోంది. 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.29,999, రూ.36,999 ధరలకు వినియోగదారులకు ఈ నెల 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఈ ఫోన్ లభ్యం కానుంది.