అన్నపూర్ణ స్టూడియోస్‌లో హత్య

man suspected to death at annapurna studio

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు సినిమా పరిశ్రమకు గుండె వంటి అన్నపూర్ణ స్టూడియోస్‌లో హత్య ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో 53 ఏళ్ల నారాయణ రెడ్డి అనే స్టూడియో ఎంప్లాయి చనిపోయాడు. ఆయన మృతదేహంను స్టూడియో సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. బంధువులకు కూడా చెప్పకుండా ఎందుకు నారాయణ రెడ్డి మృతదేహంను తరలించారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌పై పలు విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో హత్యకు సంబంధించిన వార్తలు రావడంతో ఆ స్టూడియో ప్రతిష్టపై మరింత దెబ్బ పడనుంది.

ఉస్మానియా హాస్పిటల్‌ వద్ద మృతుడి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియో సిబ్బందిని ప్రశ్నించారు. త్వరలోనే అన్నపూర్ణ స్టూడియో అధినేతను కూడా కలువబోతున్నట్లుగా తెలుస్తోంది. సాదారణ మరణం అయితే ఎందుకు హడావుడిగా ఉస్మానియాకు తరలించారు, స్టూడియోలో ఏదైనా గొడవ జరిగి ఆయన్ను హత్య చేసి ఉంటారా అనే అనుమనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోలో హత్య అనే విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రతి రోజు పదుల సంఖ్యలో సినిమాలు షూటింగ్‌ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటన జరగడం కాస్త విచారకరం, ఆందోళనకరం అంటూ సినీ వర్గాల వారు వ్యాఖ్యానిస్తున్నారు.