భరత్ కి వెన్నుపోటు

Negative talk spread on Bharat Ane Nenu Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను సినిమా సంచలన విజయం దిశగా తన కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ముఖ్యమంత్రి పాత్రలో కనువిందు చేసిన మహేష్‌కు నటనకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంటున్నది. ఫిక్ష‌న్ జోనర్ లో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. కేవ‌లం రెండు రోజుల‌లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా వంద కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ చిత్రం. నాన్ బాహుబ‌లి మూవీగా ఈ చిత్రం పాత రికార్డుల‌ని చెరిపేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా విడుదల అయిన నాటి నుండే సినిమాకి మౌత్ టాక్ కూడా తోడవ్వడంతో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

అయితే సినిమా విడుదల అయిన నాడు అన్ని వెబ్ సైట్ లు రివ్యులు ఇవ్వడం మామూలే, అలాగే భరత్ అనే నేను సినిమాకి కూడా దాదాపు అన్ని వెబ్ సైట్ లు కూడా 3 కి తక్కువ రాకుండా రేటింగ్ లు ఇచ్చాయి. దీంతో సినిమాకి మరింత బూస్టర్ లు ఇచ్చినట్టు అయ్యింది. అయితే సినిమా వచ్చిన మూడు నాలుగు రోజులకి బర్గర్ చూడటానికే బాగుంది తినడానికి కాదు అన్న చందాన, భరత్ అనే నేను సినిమా మీద కూడా నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం మొదలెట్టింది ఓ వర్గం వెబ్ మీడియా, సోషల్ మీడియా. సినిమా రొటీన్ రొట్ట అనీ కొత్తగా ఏమీ లేదని అంటూ కొన్ని నెగటివ్ ఆర్టికల్స్ రాయడం మొదలెట్టారు.

దీనికి కారణం ఇంతకు మునుపే రిలీజ్ అయిన రంగస్థలం, త్వరలో విడుదల కావాల్సి ఉన్న నా పేరు సూర్య సినిమాలు అని భరత్ అనే నేను కి వస్తున్న హైప్, పాజిటివ్ మౌత్ టాక్ ని దెబ్బ తీసేందుకే ఆ వెబ్ మీడియా నెగటివ్ రాతలు రాయిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒక పక్క మేమంతా ఒక్కటే అని చిరంజీవి నిన్న హీరోలందరితో బాటు మహేష్ తో కూడా రహస్య భేటీ నిర్వహిస్తే, వారి అనుకూల మీడియా గా చెప్పబడుతున్న వారు మాత్రం సినిమా విడుదలయిన నాలుగు రోజుల తర్వాత నుండి విషం కక్కుతున్నారు. ఈ నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వెనుక ఎవరున్నారో ఏమో ? ఏమయినా ఇలా ఒక చక్కటి సందేశాత్మక చిత్రం మన తెలుగు వారి ముందుకు వచ్చిందని ఆనందపడాల్సింది పోయి ఇలా విషం కక్కటం ఏంటో ?