ప్రగ్యా కెరీర్‌కు కీలకం

Pragya Jaiswal hopes on Achari America Yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘కంచె’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్‌కు ఆశించిన స్థాయిలో స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశం దక్కడం లేదు. మంచి ఫిజిక్‌ ఉండటంతో పాటు, బాలీవుడ్‌ రేంజ్‌ హీరోయిన్‌ గ్లామర్‌ ఉన్న ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగులో మాత్రం పెద్దగా ఆఫర్లు రావడం లేదు. చిన్నా చితక సినిమాలతో నటించుకుంటూ వచ్చిన ఈ అమ్మడు తాజాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడి చివరకు విడుదలకు సిద్దం అయ్యింది. ఈవారంలో విడుదల కాబోతున్న సినిమాపై ప్రగ్యా చాలా ఆశలు పెట్టుకుని ఉంది.

ప్రగ్యా చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమీ లేవు. సైరా చిత్రంలో ఈమె నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ పాత్ర నిడివి పది నిమిషాలు కూడా ఉండక పోవచ్చు అనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రగ్యా కెరీర్‌కు మంచు విష్ణు సినిమా కీలకం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హాట్‌ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. ఈ చిత్రం తర్వాత అయినా తెలుగు స్టార్‌ హీరోలు ప్రగ్యాను పట్టించుకుంటారేమో చూడాలి. ఒక వేళ ఆచారి అమెరికా యాత్ర చిత్రంతో ఈమె మెప్పించలేక పోతే తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె గుడ్‌ బై చెప్పడమే గత్యంతరం అని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.