భరత్ ను ఇంకా పెంచుతున్నారు

Koratala Siva want to Add new scene in Bharat Ane Nenu movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో నటించిన సినిమా భరత్ అనే నేను ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి కైరా అద్వాని కథానాయకిగా నటించింది. తెలుగులో తొలి సినిమా తోనే మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ ఏర్పాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మీట్ లో దర్శకుడు శివ కొన్ని విషయాలను మీడియాకు వెల్లడిస్తూ ఒకానొక సందర్భంలో ఈ సినిమాలోని కొన్ని మంచి సన్నివేశాలను తొలగించామని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా శివ-మహేష్-దానయ్య ఒక సందర్భంలో ఈ ముగ్గురు ఈ తొలగించిన సన్నివేశాలను గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

ఆ సన్నివేశాలను తిసివేయగా సినిమా మొత్తం 2 గంటల 53 నిమిషాలకు కుదించామని చెప్పారు. దర్శకుడు ప్రస్తుతం ఆ సన్నివేశాలను సినిమాలో జోడించే అలోచనలో ఉన్నామని అందుకు డబ్బింగ్ కుడా మొదలుపెట్టామని త్వరలోనే ఆ సన్నివేశాలను కలుపుతామని చెప్పారు. దీనితో ఆ సన్నివేశాలు ఎప్పుడు సినిమాలో జోడిస్తారో అని అటు ప్రేక్షకులు,అభిమానులు మరియు సిని పరిశ్రమలోని ప్రముఖులు ఆ సన్నివేశాలపై ఎంతో ఉత్కంటతో ఎదురుచూస్తున్నారు. గతంలో శ్రీమంతుడు సినిమాలో కూడా దర్శకుడు కొరటాల శివ కొన్ని సీన్స్ ను జోడించిన విషయం తెలిసిందే. రిపీట్ ఆడియన్స్ కోసం భరత్ లో కూడా 7 నుండి 10 నిమిషాల సీన్స్ ను కలిపే ఆలోచన దర్శకుడిది అని తెలుస్తోంది.