పుష్ప 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ..?

Pushpa 2 Teaser Release Date Fix .. Do you know when ..?
Pushpa 2 Teaser Release Date Fix .. Do you know when ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీ లో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్ తో పాటు యాగంటిలో పుష్ప -2 షెడ్యూల్ జరిగింది.

Pushpa 2 Teaser Release Date Fix .. Do you know when ..?
Pushpa 2 Teaser Release Date Fix .. Do you know when ..?

దీంతో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు . తాజాగా ఒక నెటిజన్ పుష్ప-2 అప్డేట్ గురించి ప్రశ్నించాడు. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్సక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ని సోషల్ మీడియా వేదికగా ఆరా తీశారు. వారికి ట్వీట్కు స్పందించిన శరత్ పుష్ప టీజర్ అఫ్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ రిలీజ్ అవుతుందని కామెంట్ చేశాడు. ఇది చూసిన అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు…