అల్లు అర్జున్ లేకుండానే పుష్ప2 షురూ

పుష్ప2
పుష్ప2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’ (Pushpa). ప్యాన్ ఇండియా సినిమా గతేడాది డిసెంబర్ 17న విడుదలై మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమూవీ నైజాం (తెలంగాణ) లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. పుష్ప సినిమాకు కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలు కూడా అలాగే వచ్చాయి. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. కాగా ఈసినిమాకు రెండో భాగం వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2ను తాజాగా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు చిత్ర దర్శక నిర్మాతలు.

అల్లు అర్జున్ ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి చెందిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో..

పుష్ప 2 డాన్‌గా ఎలా రూల్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన లుక్ చూస్తుంటే.. అది పుష్ప 2లో డాన్ లుక్‌గా ఉంది. నోటిలో సిగార్‌తో కళ్లద్దాలతో స్టైలిష్‌గా ఉన్న అల్లు అర్జున్ లుక్‌కు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఏం మేకోవర్ అంటూ అల్లు అర్జున్‌ను డెడికేషన్‌‌ను మెచ్చుకుంటున్నారు.

ఆర్య నుంచి పుష్ప వరకు అల్లు అర్జున్ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతం.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ నత అద్భుతమైన స్టార్ డమ్.. సూపర్ పర్ఫార్మెన్స్‌తో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు యూత్‌‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి.

ముఖ్యంగా ఇపుడు నార్త్ బెల్ట్ ప్రాంతాల్లో సౌత్ హీరోల సినిమాలకు మంచి గిరాకీ ఉంది. బాహుబలితో ప్రభాస్.. కేజీఎఫ్‌తో యశ్.. అక్కడి ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. ఆ తర్వాత పుష్పలో అల్లు అర్జున్.. ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్యాన్ ఇండియా హీరోలుగా సత్తా చాటుతున్నారు. మొత్తంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఇపుడు సౌత్ హీరోలే చిత్ర పరిశ్రమను ఏలుతున్నారనే చెప్పాలి.