ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నం.1

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నం.1

స్పానిష్ టెన్నిస్ క్రీడా కారుడు రాఫెల్ నాదల్ కి ప్రస్తుతం మొదటి స్థానాన్ని అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అందించింది. “ది కింగ్ ఆఫ్ క్లే” అనే ముద్దు పేరును తన విజయాలు తెచ్చిపెట్టాయి.

ఈ స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ ఏటీపీ ర్యాంకింగ్స్‌ లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను పొందాడు. ఏటీపీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ లో 9585 పాయింట్లతో మొదటి స్థానంలో రాఫెల్‌ నాదల్‌ ఉన్నాడు. సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ 8945 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. లండన్‌లో మొదలయ్యే సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ లో రాఫెల్‌ నాదల్‌, జొకోవిచ్‌ ఆడనున్నారు.