ఐపీఎల్‌లో కొత్త ప్రతిపాదన

ఐపీఎల్‌లో కొత్త ప్రతిపాదన

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-ఐపీఎల్‌కి ఉన్న ఆధరణ అంతా ఇంత కాదు. గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మొదటిసారి అదనపు ఆటగాడిని “పవర్‌ ప్లేయర్‌” పేరుతో మ్యాచ్‌ మధ్యలో తుది జట్టులో ఆడించవచ్చనే ప్రతిపాదన తీస్కు రానున్నది. ఈ విషయంపై బోర్డు నిర్ణయం కొరకి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరుపనున్నారు. 11 మందితో కాకుండా 15 మంది సభ్యుల జట్టును మ్యాచ్‌కు ముందు ప్రకటిస్తారు.

వికెట్‌ పడినప్పుడు గానీ, ఓవర్‌ ముగిసినప్పుడు ఒక ఆటగాడి అవసరం జట్టుకు ఉందని భావిస్తే డగౌట్‌ నుంచి అతడిని పిలిపించి నేరుగా ఆడించవచ్చు. ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఐపీఎల్‌ కంటే ముందు ఈ ప్రతిపాదన ప్రయోగాత్మకంగా తీస్కు రావాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ నిబంధనపై విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.